Friday, November 22, 2024
HomeTrending Newsరెండు పార్టీలూ కవల పిల్లలు: సోము

రెండు పార్టీలూ కవల పిల్లలు: సోము

కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే విషయంలో రాష్ట్రంలోని అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నాయని, రెండూ ఆత్మీయ కౌగిలిలో ఉన్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. నాడు ప్రత్యెక హోదా వద్దని, ప్యాకేజీ కావాలని అడిగి తీసుకొని కేంద్రాన్ని అభినందిస్తూ తీర్మానం కూడా చేశారని… ఆ తరువాతే మళ్ళీ ఆ పార్టీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ పార్లమెంట్ లో ప్రత్యెక హోదాపై ప్రశ్న వేయించారని సోము విస్మయం వ్యక్తం చేశారు. ప్యాకేజీలో 7798 కోట్ల రూపాయలు గత టిడిపి ప్రభుత్వం నిధులు తెచ్చుకున్నారని గుర్తు చేశారు.

ఇక వైసీపీ విషయానికి వస్తే సిఎం జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రత్యేక హోదాపై ప్రధానికి వినతి పత్రం ఇస్తున్నారని, కానీ ప్యాకేజీ ద్వారా ఇస్తున్న డబ్బులు వద్దని వైసేపీ ప్రభుత్వం చెప్పగలడా అని సోము ప్రశ్నించారు.  హోదాను ఓ బూచిగా చూపుతున్నారన్నారు. రెండు పార్టీలూ గూడుపుఠానీ అడుతున్నరన్నారు. నడ్డా నేతృత్వంలోని బిజెపి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారన్నారు. వైసీపీ ఎవరో నోరు తిరగనివారితో మాట్లాడించడం కాదని దమ్ముంటే సిఎం ఈ విషయమై మాట్లాడాలని సవాల్ చేశారు.

ఈ రెండు కుటుంబ పార్టీలని, ట్రేడింగ్ చేసే పార్టీలని ఆరోపించారు. లాండ్, శాండ్, లిక్కర్, మట్టి మాఫియాలతో దోచుకున్తున్నాయని విమర్శించారు. ఒకాయన పసుపు కుంకుమల పేరుతో ఒకాయన 40వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఇప్పడు మొదటినుంచే పంపకం మొదలు పెట్టారని, ఇప్పటికే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పుకుంటున్నారని, ప్రజలను తాకట్టు పెట్టి ప్రజలకే ఇస్తున్నారని మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టు గురించే మాట్లాడుతున్నారని, 1972సంవత్సరంలోనే మొదలైన ప్రాజెక్టుల  ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారని, వీటి గురించి రెండు పార్టీలూ ఎందుకు మాట్లాడడం లేదని సోము  ప్రశ్నించారు.

Also Read వెంటనే గరీబ్ యోజన వ్వాలి: సోము వీర్రాజు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్