శుభమన్ గిల్ సత్తా చాటడంతో వెస్టిండీస్ తో జరిగిన చివరి వన్డేలో కూడా ఇండియా విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ట్రినిడాడ్, పోర్ట్ అఫ్ స్పెయిన్ లో ని క్వీన్స్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 36 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగులు చేసింది. శుభమన్ గిల్ మరో రెండు పరుగుల్లో సెంచరీ పూర్తి చేసుకోవాల్సిన తరుణంలో మళ్ళీ వర్షం పడింది. దీనితో డక్ వర్త్ లూయూస్ పధ్ధతి ప్రకారం విండీస్ కు 35 ఓవర్లలో 257 పరుగుల లక్ష్యం నిర్దేశించారు.
ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టి విండీస్ ను దెబ్బ తీశాడు. ఆ తర్వాత యజువేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్ కూడా రాణించి విండీస్ ను 26 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ చేశారు.
ఇండియా బ్యాటింగ్: గిల్: 98 నాటౌట్ (98 బంర్తులు, 7ఫోర్లు, 2సిక్సర్లు); శిఖర్ ధావన్ 58 (74 బంతులు 7 ఫోర్లు); శ్రేయాస్ అయ్యర్ 44 (34 బంతులు, 4 ఫోర్లు, 1సిక్సర్)
విండీస్ బౌలింగ్: హెడెన్ వాల్ష్-2; అకీల్ హోసేన్-1వికెట్
విండీస్ బ్యాటింగ్: బ్రాండన్ కింగ్-42; నికోలస్ పూరన్-42; ఇండియా బౌలింగ్: చాహల్-4, సిరాజ్-2, శార్దూల్ ఠాకూర్ -2; అక్షర్ పటేల్-1, ప్రసిద్ కృష్ణ-1
మ్యాన్ అఫ్ ద మ్యాచ్, మ్యాన్ అఫ్ ద సిరీస్ రెండూ శుభమన్ గిల్ కే దక్కాయి.
Also Read : ఇండియాదే వన్డే సిరీస్