Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్Axar Patel show: ఇండియాదే  వన్డే సిరీస్

Axar Patel show: ఇండియాదే  వన్డే సిరీస్

వెస్టిండీస్ తో జరుగుతోన్న వన్డే సిరీస్ ను ఇండియా కైవసం చేసుకుంది. నేడు జరిగిన రెండో వన్డేలో సైతం చివరి ఓవర్లో ఉత్కంత భరిత విజయాన్ని అందుకుంది.  అక్షర్ పటేల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి విండీస్ ఆశలపై నీళ్ళు చల్లాడు.  312 పరుగుల విజయ లక్ష్యాన్ని 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఇండియా ఛేదించింది.

ట్రినిడాడ్, పోర్ట్ అఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు 65 పరుగులు చేసింది. ఓపెనర్ మేయర్స్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ షాయ్ హోప్ సెంచరీ తో రాణించాడు, 135 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు చేశాడు. షమ్రా బ్రూక్స్ 35 పరుగులతో రాణించారు. చివర్లో కెప్టెన్ నికోలస్ పూరన్ 74 పరుగులతో సత్తా చాటడంతో  నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి  311 పరుగులు చేసింది.

ఇండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు; దీపక్ హుడా, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా  48 పరుగులకు తొలి వికెట్ (కెప్టెన్ శిఖర్ ధావన్-13) కోల్పోయింది. ఆ తర్వాత శుభమన్ గిల్ (43);  సూర్య కుమార్ యాదవ్ (9) కూడా ఔటయ్యారు. 79 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో శ్రేయాస్ అయ్యర్- సంజూ శామ్సన్ లు నాలుగో వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  అయ్యర్ 63,  సంజూ 54 స్కోరు చేయగా, దీపక్ హుడా 33తో రాణించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా అక్షర్ పటేల్ క్రీజులో నిలదొక్కుకొని విండీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నాడు.  చివరి ఓవర్ నాలుగో బంతిని సిక్సర్ గా మలిచిన అక్షర్ అద్భుత విజయం అందించాడు. రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.

విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, కేల్ మేయర్స్ చెరో రెండు; సీల్స్, షెఫర్డ్, అకీల్ హోసేన్ తలా ఒక వికెట్ పడగొట్టారు,

అక్షర్ పటేల్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది

Also Read : తొలి వన్డేలో ఇండియా గెలుపు  

RELATED ARTICLES

Most Popular

న్యూస్