రాజ్యసభలో ప్రజా సమస్యలపై చర్చ జరపాలన్న ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఇచ్చిన 50 గంటల నిరవధిక ధర్నాలో టీఆర్ఎస్ పార్టీ సమర్ధవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించింది. శుక్రవారంతో ఈ ధర్నా ముగిసిన నేపథ్యంలో జాతీయ మీడియా సైతం దీన్ని ప్రముఖ అంశంగా తీసుకుంది. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సస్పెన్షన్ గురైన విపక్ష పార్టీల నిరసన కొనసాగుతోంది. జిఎస్టీ పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ఇతర ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలని విపక్ష పార్టీల ఎంపీలు నిరసన చేపట్టారు. సస్పెండ్ అయిన 20 మంది ఎంపీలు ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చ జరపాలని కోరితే అప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేసారని ఎంపీలలు విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చ కోరితే సస్పెన్షన్ ఏంటని ప్రశ్నించారు.
సస్పెన్షన్ గురైన టీఆర్ఎస్ రాజ్యసభ, విపక్ష పార్టీల ఎంపీల దీక్షకు సంఘీభావం తెలిలిన మిగిలిన టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు. విపక్షాలతో కలిసి 50 గంటల దీక్ష కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు దివకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. కాగా ఎన్ సి పి, జె ఎం ఎం పార్టీల ఎంపీలు సస్పెండ్ కాకపోయినా మిగతా వారితో కలిసి నిరసనలో పాల్గొంటున్నారు.
Also Read : TRS ఎంపీల సస్పెన్షన్ సిగ్గుచేటు: మంత్రి కేటీఆర్