Saturday, January 25, 2025
Homeస్పోర్ట్స్CWG 2022: Cricket (W): ఇండియాపై ఆసీస్ విజయం

CWG 2022: Cricket (W): ఇండియాపై ఆసీస్ విజయం

కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన టి-20 మ్యాచ్ లో ఇండియా మూడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇండియా విసిరినా 155 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆసీస్ మహిళలు మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఇండియా బౌలర్ రేణుకా సింగ్ అద్భుతంగా రాణించి 34 పరుగులకే ఆసీస్  తొలి నాలుగు వికెట్లూ తీసి కోలుకోలేని దెబ్బ తీసినా ఉపయోగం లేకుండా పోయింది.  ఆసీస్ బ్యాట్స్ వుమన్ అశ్లీగ్ గార్డెనర్ 52 పరుగులతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించింది.

బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షఫాలీ వర్మ-48 (33 బంతుల్లో 9ఫోర్లు); కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్- 52 (34 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్సర్); మరో ఓపెనర్ స్మృతి మందానా 17 బంతుల్లో ఐదు ఫోర్లతో 24 పరుగులతో రాణించారు. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో జోనస్సేన్ నాలుగు; ష్కాట్ రెండు; డార్సీ బ్రౌన్ ఒక వికెట్ సాధించారు.

ఆ తర్వాతా బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆసీస్  పరుగుల ఖాతా తెరవక ముందే ఓపెనర్ అలేస్సా హీలే వికెట్ కోల్పోయింది. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో గార్డెనర్- గ్రేస్ హారిస్ ఆరో వికెట్ కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. గార్డెనర్ 35 బంతుల్లో 9 ఫోర్లతో 52 (నాటౌట్); హారిస్ 20 బంతుల్లో ఐదు ఫోర్లు, 2 సిక్సర్లతో 37  పరుగులు చేయగా, చివర్లో అలానా కింగ్ 16 బంతుల్లో 18  పరుగులతో నాటౌట్ గా నిలిచి గార్డెనర్ తో కలిసి విజయం అందించింది.

ఇండియా బౌలర్లలో రేణుకా సింగ్ నాలుగు, దీప్తి శర్మ రెండు, మేఘనా సింగ్ ఒక వికెట్ పడగొట్టారు.

Also Read : అట్టహాసంగా కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్