కామన్ వెల్త్ గేమ్స్ లో గ్రూప్ బ్యాడ్మింటన్ లో భారత జట్టు సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను 3-0 తో ఓడించింది. గ్రూప్ విభాగంలో లీగ్ దశలో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. క్వార్టర్స్ నుంచి ఫైనల్స్ వరకూ బెస్ట్ అఫ్ ఫైవ్ ఆడతారు.
ఈ మిక్స్డ్ గ్రూప్…
తొలి మ్యాచ్ మిక్స్డ్ డబుల్స్ లో అశ్విని పొన్నప్ప- బి. సుమీత్ రెడ్డి జోడీ 21-9;21-11తో జార్ద్ ఇల్లియోట్- దీద్ర జోర్డాన్ పై
రెండో మ్యాచ్ పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ 21-5; 21-6తో కాడెన్ కకోరా పై
మూడో మ్యాచ్… మహిళల సింగిల్స్ లో ఆకర్షి కాశ్యప్ 21-11; 21-16 తో జోహానిత క్లాత్జ్ పై గెలుపొందారు.
వరుసగా మూడు మ్యాచ్ లు విజయం సాధించడంతో… పురుషుల-మహిళల డబుల్స్ మ్యాచ్ లు ఆడకుండానే సెమీస్ లోకి ఇండియా జట్టు అడుగు పెట్టింది.