Saturday, July 4, 2026
Homeస్పోర్ట్స్CWG-2022: వెయిట్ లిఫ్టింగ్ లో ఇండియాకు మరో స్వర్ణం

CWG-2022: వెయిట్ లిఫ్టింగ్ లో ఇండియాకు మరో స్వర్ణం

వెయిట్ లిఫ్టింగ్ లో ఇండియా ముచ్చటగా మూడో స్వర్ణ పతకం సాధించింది. ఈ తెల్లవారుజామున జరిగిన పోటీలో భారత ఆటగాడు అచింత షూలీ 73 కిలోల విభాగంలో  స్నాచ్- క్లీన్ అండ్ జర్క్ విభాగంలో మొత్తం 313 కిలోల బరువు ఎత్తడం ద్వారా పసిడి పతకం ఒడిసి పట్టుకున్నాడు.

2019, 2021  సంవత్సరాల్లో కామన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో విజేతగా నిలిచినా అచింత 2021 తాష్కెంట్ లో జరిగిన వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ జూనియర్  ఛాంపియన్ షిప్ పోటీల్లో రజత పతకం సాధించాడు. ఈ అన్ని పోటీల్లోనూ 73కిలోల విభాగంలోనే ఈ ఘనత సాధించాడు షూలీ.

ఈ స్వర్ణంతో ఇండియా ఇప్పటికి మొత్తం ఆరు పతకాలు సంపాదించగా వీటిలో మూడు స్వర్ణం, రెండు రజతం, ఒక కాంస్యం ఉన్నాయి.

Also Read CWG-2022:  స్వర్ణం సాధించిన జెరేమీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular