వరదల సమయంలో ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ రెండు వేల రూపాయల ఆర్ధిక సాయం, రేషన్, పాలు అందించిందని, ఈ సాయం పట్ల బాధితులు కూడా సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా చెప్పారు. చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని, వాలంటీర్లను పేటిఎం బ్యాచ్ అంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రోజా విమర్శించారు.
పేటిఎం బ్యాచ్ తో భజనలు చేయించుకోవడం అలవాటని, పోలవరం కట్టకుండానే బస్సుల్లో జనాలను తీసుకెళ్ళి భజన చేయించుకున్నారని రోజా గుర్తు చేశారు. 14ఏళ్ళ పాటు సిఎంగా పనిచేసిన చంద్రబాబు పోలవరం ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. సిఎం జగన్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం 20వేల కోట్ల రూపాయలు నిధులకోసం కృషి చేస్తున్నారని వివరించారు.
కుప్పం ను కనీసం మున్సిపాలిటీ గానే, రెవెన్యూ డివిజన్ గానీ చేసుకోలేని చంద్రబాబు ముంపు గ్రామాలతో ప్రత్యేకంగా జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
Also Read : టైమ్ పాస్ పాలిటిక్స్ నమ్మరు: రోజా