Saturday, April 19, 2025
HomeTrending Newsనేటి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర

నేటి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర

మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఖైరతాబాద్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆ తర్వాత బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి నివాళులు అర్పించి పార్టీ కార్యాలయం నుండి యాదాద్రికి బయలుదేరిన బండి సంజయ్ కుమార్.

బండి సంజయ్ కు స్వాగతం పలికేందుకు యాదాద్రికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం ప్రారంభం కానున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర, ఈ రోజు మధ్యాహ్నం యాదగిరిగుట్ట పట్టణ శివార్లలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి.

Cm Kcr Yadadri

ఇవాళ యాదగిరిగుట్ట నుంచి పాత గుట్ట రోడ్డు, గొల్ల గుడిసెలు, గొల్లగూడెం మీదుగా దాతర్ పల్లి గ్రామం వరకు కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర. ఇవాళ రాత్రికి భువనగిరి మండలం బస్వాపూర్ శివార్లలో బండి సంజయ్ రాత్రి బస చేస్తారు. 5 జిల్లాలు, 12 నియోజకవర్గాల మీదుగా 24 రోజుల పాటు 328KM మేర కొనసాగనున్న పాదయాత్ర. మొదటి రోజు మొత్తం 10.5 KM పాదయాత్ర చేయనున్న బండి సంజయ్.

Also Read : ప్రజా సంగ్రామ యాత్ర, టీఆరెస్ ను గద్దెదించే యాత్ర

RELATED ARTICLES

Most Popular

న్యూస్