నిఖిల్ హీరోగా ‘కార్తికేయ 2‘ రూపొందింది. అభిషేక్ అగర్వాల్ – విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో నిఖిల్ మాట్లాడుతూ .. “‘కార్తికేయ ఫస్టు పార్టు ఎక్కడైతే ఆగిందో, సెకండ్ పార్టు అక్కడి నుంచే మొదలవుతుంది. ఫస్టు పార్టులో ఉన్న పాత్రలు అలాగే కంటిన్యూ అవుతాయి. స్వాతి పాత్ర ఉంటుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్.
ఈ సినిమా షూటింగు సమయంలోనే రెండు పాండమిక్ లు చూశాము. మాటిమాటికీ సినిమా షూటింగు ఆపేయవలసి వచ్చేది .. గ్యాప్ పెరిగిపోతూ ఉండటం వలన చాలా టెన్షన్ అనిపించేది. ఫస్టు పార్టు సూపర్ హిట్ కావడం వలన సెకండ్ పార్టు అంతకుమించి అన్నట్టుగానే ఉండాలి కనుక, ఆ దిశగానే అందరం కష్టపడ్డాం. ‘కార్తికేయ’ అనేది నా కెరియర్ ను మలుపు తిప్పిన సినిమా. ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చే ఈ సినిమా త్వరగా విడుదల కావాలనే ఒక ఆత్రుత ఉండటం సహజం. అందువలన ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని వెయిట్ చేశాను.
కొన్ని రోజుల క్రితం మాత్రం ఈ సినిమాకి థియేటర్లు దొరుకుతాయా? అసలు ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదలవుతుందా? అనే ఆలోచన చేశాను. బలమైన నేపథ్యం లేనివారి సినిమాను వెనక్కి తోసేస్తారని విన్నాను. నా సినిమా విషయంలో అది నాకు అనుభవంలోకి వచ్చింది. మా సినిమాను అక్టోబర్లోగానీ .. నవంబర్లో గాని రిలీజ్ చేసుకోమన్నారు. అప్పటివరకూ థియేటర్లు దొరకవన్నారు. నిజానికి నేను చాలా స్ట్రాంగ్ .. కానీ ఆ రోజున మాత్రం ఏడ్చేశాను. మా నిర్మాతలు పట్టుబట్టి ఈ డేట్ ను ఖరారు చేసుకున్న తరువాత నాకు హ్యాపీగా అనిపించింది” అని చెప్పుకొచ్చాడు.
Also Read : ఇస్కాన్ టెంపుల్లో కార్తికేయ 2 టీమ్ సందడి