కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదటి సారి ఓ సరికొత్త ఆటలో నేరుగా బంగారు పతకం సంపాదించింది. మహిళల లాన్ బౌల్స్ (ఫోర్) మ్యాచ్ లో సౌతాఫ్రికాపై 17-10తో విజయం సాధించి సత్తా చాటింది.
రూపా రాణి టిర్కీ, నయన్మోని సైకియా, లవ్లీ చౌబె, పింకీ సింగ్ లతో కూడిన జట్టు ఈ ఆటలో ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించి బలమైన జట్టుగా ఉన్న సౌతాఫ్రికా ఆటగాళ్ళను ఓడించారు.
ఈ ఆటపై ఇప్పటికీ భారత క్రీడాభిమానులకు సరైన అవగాహన లేకపోయినా మన ఆటగాళ్ళు బంగారు పతకం సాధించడం దేశానికే గర్వకారణంగా చెప్పవచ్చు,
Also Read : మీరాకు బంగారం, బింద్యాకు రజతం