అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ క్రేజీ మూవీ పై అక్కినేని అభిమానులు మాత్రమే కాదు.. అఖిల్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఇక ఇటీవల రిలీజ్ చేసిన ఏజెంట్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు ఇంకా పెరిగాయి. వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత కథలో మరోసారి మార్పులు చేర్పులు చేయడం వలన మరికాస్త ఆలస్యం అయ్యింది. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడిన ఏజెంట్ ఈ సంవత్సరంలో అసలు రాదనే టాక్ కూడా వినిపించింది.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… బాలయ్య రావాలనుకున్న డేట్ కి అఖిల్ ఏజెంట్ వస్తుందట. మలినేని గోపీచంద్ రూపొందిస్తోన్న బాలయ్య 107వ సినిమా అఖండ రిలీజైన డిసెంబర్ 2న వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సంక్రాంతికి మారింది. డిసెంబర్ 2నే అఖిల్ ఏజెంట్ మూవీని విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. త్వరలో అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.
Also Read : ‘ఏజెంట్’ నిర్మాత ఇంట్రస్టింగ్ కామెంట్స్