కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియాకు మరో గోల్డ్ మెడల్ లభించింది. పారా పవర్ లిఫ్టర్ సుధీర్ పురుషుల హెవీ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సంపాదించాడు. మొత్తం 212కిలోల బరువు ఎత్తి 134.5 పాయింట్లు సంపాదించాడు. 2018లో ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన ఏసియన్ పారా గేమ్స్ లో కాంస్య పతకం గెల్చుకున్నాడు సుధీర్.
నిన్న సుధీర్ తో పాటు మురళీ శేఖరన్ పురుషుల లాంగ్ జంప్ విభాగంలో రజత పతకం సంపాదించాడు. 8.08 మీటర్లు దూకి పతకం ఖాయం చేసుకున్నాడు. కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియాకు లాంగ్ జంప్ లో పతకం అందించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఈ రెండు విజయాలతో ఇండియా సాధించిన మొత్తం పతకాల సంఖ్య 20కి చేరింది. వీటిలో ఆరు గోల్డ్, ఏడు సిల్వర్, ఏడు బ్రాంజ్ ఉన్నాయి.
Also Read : Weight Lifting: ఇండియాకు మరో రజతం