Wednesday, November 27, 2024
HomeTrending News21న అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ చేరిక

21న అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ చేరిక

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. బిజెపి లో చేరే అంశంపై చర్చించి నట్టు తెలిపారు. ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ రాగోపాల్ రెడ్డి పార్టీ మార్పుకు దారి తీసిన అంశాల్ని వివరించారు. మూడేళ్ళుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజకవర్గ ప్రజలకోసం ఏమి చేయలేకపోయాను. ఇందుకు బాధపడుతున్నాని అన్నారు. కేవలం సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల లో మాత్రమె అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మునుగోడు ఉపఎన్నిక ఉంటుందని భావిస్తున్నాను.

బిజెపి లో చేరే విషయమై కేంద్ర హోం మంత్రి అమితే షా తో చర్చించాను. ఈ నెల 21 వ తేదిన అమిత్ మునుగోడు నియోజకవర్గానికి రానున్నారు ఆయన సమక్షంలో బిజెపి లో చేరుతాను. అదే సమయంలో మరికొందరు నేతలు బిజెపిలో చేరే అవకాశం ఉందని అమిత్ షా చెప్పారు. ఎంపి గా ఉన్నపుడు నేను వివేక్ తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశామని రాజగోపాల్ చెప్పారు. తెలంగాణ బిజెపి ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాత అమిత్ షా బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలనేది నిర్ణయం తీసుకుంటాము.

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 8వ తేదిన అనుకుంటున్నాము. అయితే స్పీకర్ సమయం దొరకలేదు. ఒకవేళ ఆ రోజు శాసనసభ సభాపతి లేకపోతే అసెంబ్లీ కార్యదర్శికి ఆ రోజు రాజీనామా లేఖ ఇస్తాను.

పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవతంపై సీనియర్ లను సమోప్రదించలేదు. రేవంత్ రెడ్డి ఏక పక్షంగా తీసుకుంటున్నారు. బిజెపికి అమ్ముడుపోయినట్టు రేవంత్ రెడ్డి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఢిల్లీ తెలంగాణ భవన్ సాక్షిగా సవాల్ చేస్తున్నాను. ఓ చిల్లర దొంగ తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారని రాజగోపాల్ ఘాటుగా విమర్శించారు. వ్యక్తిత్వం లేని రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.

ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సరైన సమయంలో పార్టీ మారే అంశంపై నిర్నయం తీసుకుంటారని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.

Also Readకెసిఆర్ తోనే నా యుద్ధం రాజగోపాల్ రెడ్డి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్