సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం లైగర్. ఈ భారీ పాన్ ఇండియా మూవీని పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజ్ చేసిన లైగర్ ట్రైలర్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది. ఆగష్టు 25న లైగర్ మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. దీంతో అటు విజయ్ అభిమానులు ఇటు పూరి అభిమానులు ఎప్పుడెప్పుడు లైగర్ రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. 2 గంటల 20 నిమిషాలు నిడివితో ఉన్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. లైగర్ ఫస్ట్ హాఫ్ 1 గంట 15 నిమిషాలు.. సెకండాఫ్ 1 గంట 5 నిమిషాల రన్ టైం వచ్చింది. ఏడు ఫైట్లు, ఆరు పాటలతో పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నటన ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తుందని సెన్సార్ రిపోర్ట్ చెబుతోంది.
ఇందులో యాక్షన్ సీన్స్, క్రేజీ మాస్ డ్యాన్స్ లతో విజయ్ అదరగొట్టాడని అంటున్నారు. ఈ అంశాలు ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా ఉండబోతున్నాయి. పూరి మార్క్ క్యారెక్టరైజేషన్, నత్తి ఉన్న యువకుడిగా విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ విశేషంగా ఆకట్టుకోనున్నాయి. విజయ్ దేవరకొండ – హీరోయిన్ అనన్య పాండేల లవ్ ట్రాక్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని.. క్లైమాక్స్ ఎపిసోడ్ హైలెట్స్ లలో ఒకటిగా నిలుస్తుందని మొత్తానికి లైగర్ విజయ్, పూరిలకు మంచి హిట్ అందిస్తుందని టాక్. మరి.. ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.