ఎంతో మంది మహనీయుల త్యాగఫలంతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నెక్లెస్ రోడ్‌లోని థ్రిల్ సిటీలో ఈ రోజు జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. వజ్రోత్సవాలలో భాగంగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గాంధీ చిత్ర ప్రదర్శనను మంత్రి తలసాని ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్ లో ప్రారంభించారు. విద్యార్థులు, FDC చైర్మన్ అనిల్ కూర్మాచలం, MLA దానం నాగేందర్, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, FDC అధికారులతో కలిసి చిత్రాన్ని వీక్షించిన మంత్రి
ఈ సందర్భంగా బెలూన్లను ఎగుర వేశారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వారిని స్మరించుకున్నారు. దేశానికి లభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 22వ తేదీ వరకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. దేశ సమైక్యతను చాటే విధంగా ఇంటికో జాతీయ జెండా చొప్పున కోటి 20 లక్షల జెండాల ప్రభుత్వం పంపిణీ చేస్తోందని, ఆగస్టు 15 వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ స్ఫూర్తి ని చాటి చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పిలుపు ఇచ్చారు.
Also Read : 9 నుండి 22 వరకు వజ్రోత్సవ వేడుకలు