టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘ది ఘోస్ట్‘ మూవీ చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాగ్ సరసన సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
అయితే.. ఈ సినిమా తర్వాత నాగార్జున ఎవరితో సినిమా చేయనున్నారనేది అధికారికంగా ప్రకటించలేదు. మోహన్ రాజా డైరెక్షన్ లో ఓ భారీ చిత్రంలో నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే చందు మొండేటి డైరెక్షన్ లో నాగార్జున ఓ సినిమా చేయనున్నట్టుగా గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. ప్రేమమ్ తర్వాత చందు మొండేటి నాగార్జునకు ఓ కథ చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వలన సెట్ కాలేదు.
ఇప్పుడు అంతా సెట్ అయ్యిందని.. నాగార్జునతో సినిమా ఉంటుందని చందు మొండేటి ప్రకటించారు. కార్తికేయ 2 ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన చందు నెక్ట్స్ మూవీని జీఏ2 బ్యానర్ లో చేస్తున్నానని.. ఆతర్వాత నాగార్జునతో మూవీ చేయనున్నాని ప్రకటించారు. అంటే.. వచ్చే సంవత్సరం నాగార్జున, చందు మొండేటి కాంబినేషన్లో మూవీ సెట్స్ పైకి రానుంది.
Also Read : ‘ది ఘోస్ట్’ షూటింగ్ పూర్తి