Saturday, November 23, 2024
HomeTrending Newsవిచ్ఛిన్న శక్తులను అడ్డుకుందాం - కాంగ్రెస్

విచ్ఛిన్న శక్తులను అడ్డుకుందాం – కాంగ్రెస్

గాంధీభవన్‌ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ 1947 లో స్వాతంత్ర్య సంబరాలు ఒకవైపు… దేశ విభజన విషాదాలు ఒకవైపు… అక్కడ నుండి దేశ తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ ముందు సవాలక్ష సవాళ్లతో మన ప్రస్థానం మొదలైందన్నారు. టీం స్పిరిట్ తో నెహ్రూ ఈ దేశ భవిష్యత్ కు పునాదులు వేశారని,  అంబేద్కర్ అందించిన రాజ్యాంగ మార్గదర్శనంలో దేశం దేశం తొలి అడుగు వేసింది. ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు, సమస్యలు అదిగమించిన్దన్నారు.
75 సంవత్సరాల భారతావని ప్రస్థానంలో ఎన్నో విజయ శిఖరాలను అధిరోహించాం. ఇదే స్ఫూర్తితో ముందుకు కొనసాగాలన్నారు. దేశం ముందు నేడు అతి పెద్ద సవాళ్లు ఉన్నాయి. భారత ఆత్మ భిన్నత్వంలో ఏకత్వం. లౌకిక తత్వానికి నేడు ముప్పు ఏర్పడింది. ప్రజాస్వామ్య విలువల పతనమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మనం భారతీయులం… మనది భారతజాతో అన్న ఒకేఒక్క సిద్ధాంతం దేశ సమగ్రతను కాపాడుతుంది. దాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య – పార్లమెంటరీ వ్యవస్థల పతనాన్ని సంఘటితంగా అడ్డుకుందామని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్ , గీతారెడ్డి , అజారుద్దీన్ , మాజీ మంత్రి షబ్బీర్ అలీ , కుసుమ కుమార్ , అనిల్ కుమార్ యాదవ్ , శివసేనారెడ్డి , అజ్మత్ హుస్సేన్ , ఫిరోజ్ ఖాన్ , అనుబంధ సంఘాల ఛైర్మన్‌లు సీనియర్ నాయకులు,కార్యకర్తలు హాజరయ్యారు.
Also Read : 
RELATED ARTICLES

Most Popular

న్యూస్