స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు రాజ్ భవన్ లో తేనీటి విందు (ఎట్ హోమ్) ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తొలుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని లతో కలిసి రాజ్ భవన్ కు చంద్రబాబు చేరుకున్నారు. ఆ తరువాత సిఎం జగన్ సతీ సమేతంగా విచ్చేశారు. సిఎం నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి ఆయన్ను రిసీవ్ చేసుకుని ఒక టేబుల్ వద్దకు అంతా కలిసి వెళ్ళారు. ఆ టేబుల్ పై సిఎం, గవర్నర్ దంపతులతో పాటు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు కూడా ఆశీనులయ్యారు. ఈ టేబుల్ కు కొంత దూరంలో ఉన్న మరో టేబుల్ పై చంద్రబాబు, ఆ పార్టీ నేతలు కూర్చున్నారు.
గవర్నర్ అతిథులతో పాటు బాబు టేబుల్ వద్దకు వెళ్లి ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు. సిఎం జగన్ మాత్రం తన టేబుల్ వద్దే కూర్చుండి పోయారు.
ఈ కార్యక్రమానికి ఇద్దరు నేతలూ హాజరైనా ఒకరినొకరు పలకరించుకోకపోవడం చర్చనీయంశామైంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు ఇది తార్కాణం.