Saturday, November 23, 2024
HomeTrending Newsఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన

ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన

75 సంవత్సరాల స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు. తెలంగాణ అంతటా భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలాపనతో ఊరూ, వాడా..పల్లె, పట్నప్రాంతాల్లో ప్రజలు కదిలివచ్చారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు అంగన్‌వాడీ తదితర సెంటర్లో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.

స‌రిగ్గా ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌గ‌ణ‌మ‌ణ గీతాన్ని ఆల‌పించారు. అబిడ్స్ జీపీవో స‌ర్కిల్ వ‌ద్ద జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీలు కేశ‌వ‌రావు, అస‌దుద్దీన్ ఓవైసీ, మంత్రులు మ‌హ‌ముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని విజ‌య‌వంతం చేశారు.

 

బీఆర్ కేఆర్ భవన్ లో సామూహిక జాతీయ గీతాలాపన, ఈ కార్యక్రమంలో స్పెషల్ సి.ఎస్ లు రాణి కుముదిని, సునీల్ శర్మ, ముఖ్య కార్యదర్శి రవి గుప్త, అడిషనల్ సెక్రటరీ చంపాలాల్, సచివాలయ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది జాతీయ గీతాలనలో పాల్గొన్నారు.

బాన్సువాడ నుండి హైదరాబాద్ విచ్చేస్తున్న స్పీకర్ పోచారం గారు 11.30 గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన తన కాన్వాయ్ ను ఆపి సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన లో పాల్గొన్నారు.

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీ లో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం దాదాపు 30 వేల మంది విద్యార్థులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని మిని ట్యాంక్ బండ్ పై నిర్వ‌హించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్