నిన్నటి తీవ్ర వాయుగుండం..పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ జార్ఖండ్ ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా మీదుగా కేంద్రీకృతమైంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర మధ్యప్రదేశ్ వైపు వెళ్తోంది. ఈక్రమంలో వాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయి. రాగల మూడు రోజులపాటు తెలంగాణలో తేలికా పాటి నుంచి మోస్తరు కురిసే అవకాశం ఉంది. ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాలతోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ వైపు ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం ఏపీపై అధికంగా ఉండే అవకాశం ఉందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. ఉత్తర కోస్తా, యానాంలో ఇవాళ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.