భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సేన్ ను ఓడించాడు. గత ఆరు నెలల్లో సేన్ ను ప్రజ్ఞ ఓడించడం ఇది మూడో సారి. మియామిలో జరుగుతోన్న అమెరికన్ ఛాంపియన్ షిప్ FTX క్రిప్టో కప్ లో భాగంగా నేడు జరిగిన గేమ్ రెగ్యులర్ సమయంలో 2-2 తో డ్రా కాగా ఆర్మగెడ్డాన్ లో 4-2 తేడాతో ప్రజ్ఞానంద పైచేయి సాధించాడు. ఈ మ్యాచ్ లో గెలిచినప్పటికీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ప్రజ్ఞానంద నిలిచాడు. కార్ల్ సేన్ మొదటి స్థానం దక్కించుకున్నాడు. మొత్తంగా కార్ల్ సేన్ 16 పాయింట్లు సంపాదించగా, ప్రజ్ఞానంద తో పాటు ఇరానియన్- ఫ్రెంచ్ గ్రాండ్ మాస్టర్ అలిరేజా ఫిరౌజా 15 పాయింట్లు సంపాదించారు. అయితే గత మ్యాచ్ లో అలిరెజా పై ప్రజ్ఞా గెలుపొందడంతో రెండో స్థానం దక్కింది.
ఈ టోర్నీలో వరుసగా నాలుగు గేమ్స్ గెల్చుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ఐదో రౌండ్ లో క్యుయాంగ్ లియెమ్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
2016లో పదేళ్ళ వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించుకొని చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద గత ఫిబ్రవరిలో కూడా కార్ల్ సేన్ ను ఆన్లైన్ లో ఓడించాడు. మరోసారి మే నెలలో చెసబుల్ మాస్టర్స్ ఆన్ లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ లో కూడా ఓడించాడు.
ఈ టోర్నీలో రెండో స్థానంలో నిలిచినా ప్రజ్ఞానంద షుమారు 50 లక్షల ప్రైజ్ మనీ గెల్చుకున్నారు.