భారత రాష్త్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కలుసుకుని శుబాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం నేడు పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ముకు భేషరతుగా మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఆమె రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి ఢిల్లీ వచ్చిన సిఎం జగన్ ఆమెతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
అంతకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ లను సిఎం జగన్ కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని నేటి సాయంత్రం బయల్దేరి తాడేపల్లి చేరుకున్నారు.