అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ లో వరుసగా విజయాలు సాధించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఇటీవల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘లాల్ సింగ్ చడ్డా‘ మూవీలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది కానీ.. నాగచైతన్య పాత్రకు మాత్రం మంచి పేరు వచ్చింది. అయితే…ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగచైతన్య నెపోటిజం గురించి మాట్లాడిన మాటలు సంచలనం అయ్యాయి.
ఇంతకీ నాగచైతన్య ఏమన్నారంటే.. బాలీవుడ్ తో పోలిస్తే.. టాలీవుడ్ లో నెపోటిజం తక్కువే. తాత, నాన్న సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్ల ప్రభావంతో నేను కూడా నటుడు అవ్వాలనుకున్నాను. ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అయితే.. వాళ్ల వారసుడుగా ఇండస్ట్రీలోకి ఈజీగా వచ్చాను కానీ.. హీరోగా నిలబడడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నాను అన్నారు. అంతే కాకుండా.. తను నటించిన సినిమా, సెల్ఫ్ మేడ్ హీరో సినిమా ఒకేసారి రిలీజ్ అయితే.. తన సినిమాకి 10 కోట్లు, సెల్ఫ్ మేడ్ హీరో సినిమాకి 100 కోట్లు వస్తే.. నిర్మాత అతని వద్దకే వెళతారు.
రేపు ఈ సెల్ఫ్ మేడ్ హీరోలు వారి వారసులు ఇండస్ట్రీకి వస్తాము అంటే.. మేము నెపోటిజం అనుభవించాం.. మీరు రావద్దు అనరు కదా..? అన్నారు చైతన్య. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: చైతు షాకింగ్ నిర్ణయం?