జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతోన్న బి.డబ్ల్యూ.ఎఫ్. వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2022లో నేడు రెండో రోజు ఇండియా క్రీడాకారులు సత్తా చాటారు. సైనా నెహ్వాల్; గాయత్రి గోపీచంద్- త్రెసా జాలీ….. అశ్విని భట్- శిఖా గౌతమ్ జోడీలు తమ ప్రత్యర్థులపై గెలుపొంది తర్వాతి రౌండ్లోకి ప్రవేశించారు.
మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ 21-19;21-9తో హాంగ్ కాంగ్ ప్లేయర్ చెయుంగ్ యెన్ యి పై విజయం సాధించింది.
మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీచంద్ -త్రెసా జాలీ జోడీ 21-11; 21-13తో మలేషియా జంట లో యూ యుయాన్-వలెర్రీ సియో పై…. మరో మ్యాచ్ లో అశ్విని భట్- శిఖా గౌతమ్ జోడీ 21-8, 21-14తో ఇటలీ క్రీడాకారులు మార్టినా కోర్సిని-జుడిత్ మయిర్ పై విజయం సాధించారు
పురుషుల డబుల్స్ లో గరగ కృష్ణ ప్రసాద్- పంజాల విష్ణు వర్ధన్ గౌడ్ ద్వయం 14-21;18-21 తేడాతో ఫ్రాన్స్ ఆటగాళ్ళు ఫాబిఎన్ డెల్రూ-విలియం విల్లెగేర్ చేతిలో ఓటమి పాలయ్యారు.
మిక్స్డ్ డబుల్స్ లో
ఇషాన్ భట్నాగర్- తానీషా క్రాస్టో జోడీ 14-21; 17-21 తేడాతో థాయ్ లాండ్ జోడీ సుపాక్ జోంఖో- సుపిస్సరపై ఓడిపోయారు.
వెంకట్ గౌరీ ప్రసాద్- జూహీ దేవాంగన్ ద్వయం 21-10, 23-21 తో ఇంగ్లాండ్ జంట గ్రెగొరీ మైర్స్- జెన్నీ మూర్ చేతిలో ఓటమి పాలయ్యారు.
Also Read: తొలి రౌండ్ లో ఇండియాకు ఆరు విజయాలు