Saturday, November 23, 2024
HomeTrending Newsముద్రగడ విషయంలో ఏమైంది: కొడాలి

ముద్రగడ విషయంలో ఏమైంది: కొడాలి

కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ నాడు ముద్రగడ పద్మనాభం దీక్ష చేసినప్పుడు చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టారో పవన్ కళ్యాణ్ కు తెలియదా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.  లోకేష్ ను పలాస వెళ్ళకుండా అడ్డుకున్నారని పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబు, పవన్ ఇద్దరూ ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన భార్యను పోలీసులతో తిట్టించినందుకు, కుమారుడిని లాఠీలతో కొట్టిన్చినందుకు క్షమాపణ చెప్పాల్సి ఉంటుందన్నారు. అప్పుడు కళ్ళున్న కబోదిలాగా, బాబు ప్యాకేజీలకు కక్కుర్తి పడి, చిల్లర పైసల కక్కుర్తితో తాను కూడా తప్పు చేశానని పవన్ కూడా చెప్పాలన్నారు. ముద్రగడ దంపతుల కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకోవాల్సి ఉంటుంది కదా అని పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్, చిరంజీవి పేర్లు వాడుకోకుండా ఎన్నికలకు వెళ్తే  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల పరిస్థితి గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అని, చందబాబు ప్యాకేజీల కోసం పనిచేసే వ్యక్తీ అని మండిపడ్డారు. పవన్ కు, వైసీపీ నేతలకు పోలికే లేదన్న నాని 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జనసేన, టిడిపి నేతల పీడా విరగడ అయిపోతుందన్నని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

Also Read : ఉపయోగం లేకపోతే కొడాలి కామెంట్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్