ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్ రమేశ్ బైస్‌కు ఈమేరకు నివేదిక సమర్పించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం.
ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్.. మైనింగ్ లీజును తనకు తానే కేటాయించుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపిస్తూ బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ అభిప్రాయం గవర్నర్ కోరారు. ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా అతి త్వరలోనే ముఖ్యమంత్రిపై గవర్నర్ చర్యలు తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం తమ పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని హేమంత్ సోరేన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. సాయంత్రానికల్లా ఆయన కూడా రాంచి చేరుకోనున్నారు.
Also Read : హేమంత్ సోరెన్ పై ఈడీ దాడులు