Saturday, November 23, 2024
HomeTrending Newsగులాం నబీ ఆజాద్ రాజీనామా

గులాం నబీ ఆజాద్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో పలువురు నాయకులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. జమ్ముకాశ్మీర్ కు చెందిన గులాం నబి ఆజాద్ కొద్ది నెలలుగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.

తన రాజీనామాకు కారణాలు వివరిస్తూ ఆజాద్ సుధీర్గమైన లేఖ రాశారు. పార్టీలో రాహుల్ జోక్యం పెరిగిందని, పార్టీ అధ్యక్ష పదవి వద్దని చెపుతూనే అన్ని విషయాల్లో తలదూర్చుతున్నారని ఘాటుగా విమర్శించారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైందని ఆజాద్ విమర్శించారు.

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్