పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ టైటిల్ కూడా కన్ ఫర్మ్ చేశారని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే.. ఇది రాజా డీలక్స్ అనే ఓ థియేటర్ చుట్టూ తిరిగే తాత – మనవల కథ. పూర్వీకుల నుంచి వారతస్వంగా వచ్చిన సందపదగా థియేటర్ నేపథ్యాన్ని బేస్ చేసుకుని మారుతి కథని అల్లినట్లు తెలుస్తోంది. ఈ థియేటర్లో ప్రభాస్ ఏం చేశాడు.? అతని పూర్వీకులు ఏం చేశారు..? థియేటర్ వలన ప్రభాస్ కి వచ్చిన కష్టాలు ఏంటి..? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే రాజా డీలక్స్ స్టోరీ అని ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ థియేటర్ సెట్ ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ సెట్ కోసమే 6 కోట్లు కేటాయించారట. కథ అంతా థియేటర్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి పెద్దగా లోకేషన్ల పని ఉండదదు. సినిమా మొత్తం రెండు షెడ్యూల్స్ లో పూర్తిచేస్తారని సమాచారం. ప్రభాస్ ఈ సినిమా కోసం తక్కువగానే డేట్లు కేటాయించినట్లు తెలిసింది. మరి.. మారుతి ఈ అద్భుత అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.
Also Read : అక్టోబర్ నుంచి ప్రభాస్, మారుతి మూవీ?