సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్ క్రికెట్ టీమ్ లో యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ కూడా ఆడనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగించేందుకు భారత ప్రభుత్వ రోడ్డు రవాణా-జాతీయ రహదారులు…. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ నిర్వహిస్తున్నారు. గత ఏడాది మొదలైన ఈ టోర్నమెంట్ లో ఇండియా విజేతగా నిలిచింది. ఇండియా తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు పాల్గొన్నాయి, ఈ ఏడాది న్యూ జిలాండ్ టీమ్ కొత్తగా ఈ టోర్నీలో చేరింది.
సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 1 వరకూ 22 రోజులపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ టోర్నీ జరగనుంది. కాన్పూర్ లో ఆరంభ మ్యాచ్ జరగనుంది. రెండు సెమీఫైనల్స్ తో పాటు ఫైనల్ మ్యాచ్ రాయ్ పూర్ లో జరగనుంది.
ఇండియా టీం వివరాలు: సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్. యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, స్టువార్ట్ బిన్నీ, ఎస్ బదరీనాథ్, నామాన్ ఓజా, మన్ ప్రీత్ గోనీ, ప్రజ్ఞాన్ ఓఝా, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, రాజేష్ పొవార్, రాహుల్ శర్మ