మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఈ మూవీకి మోహన్ రాజా డైరెక్టర్. మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ మూవీకి రీమేక్ ఇది. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గెస్ట్ రోల్స్ చేస్తుండడంతో గాడ్ ఫాదర్ మూవీ పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. నయనతార, సత్యదేవ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. అదే రోజున కింగ్ నాగార్జున ది ఘోస్ట్ మూవీ కూడా రిలీజ్ కానుంది. అయితే..గాడ్ ఫాదర్ మూవీని తక్కువ థియేటర్లో రిలీజ్ చేయమని చిరంజీవి నిర్మాతకు చెప్పారట. పోటీగా నాగార్జున సినిమా ఉండడం వలన కాదట. ఆచార్య సినిమాను భారీగా రిలీజ్ చేశారు. చాలా ఏరియాల్లో ఫస్ట్ డే మ్యాట్నీకి ఆడియన్స్ లేరని వార్తలు వచ్చాయి.
అందుచేత చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారట. ఆచార్య జరిగిన తప్పులు ఇప్పుడు జరగకుండా అన్ని ఏరియాల్లో ఫుల్స్ అయ్యేలా పక్కా ప్లాన్ రెడీ చేసారని టాక్ వినిపిస్తోంది. మరి.. ఆచార్య సినిమాతో డీలాపడ్డ చిరు గాడ్ ఫాదర్ మూవీతో సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.