అల్టిమేట్ ఖో-ఖో తొలి టోర్నమెంట్ లో ఓడిశా విజేతగా నిలిచింది. నేడు జరిగిన ఫైనల్ లో తెలుగు యోధాస్ తో జరిగిన హోరా హరీ పోరులో ఓడిశా కేవలం ఒక్క పాయింట్ తేడాతో గెలుపొంది టైటిల్ చేజిక్కించుకుంది. మహారాష్ట్ర పూణేలోని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నే ఈ మ్యాచ్ లు అన్నీ జరిగాయి.
నేడు జరిగిన ఫైనల్లో ఓడిశా టాస్ గెలిచి డిఫెండ్ ఎంచుకుంది. మొదటి ఏడు నిమిషాల అనంతరం ఇరు జట్లూ చెరో 10పాయింట్లు సంపాదించాయి. తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి ఓడిశా మూడు పాయింట్ల ఆధిక్యం సంపాదించింది.
రెండో ఇన్నింగ్స్ తొలి ఏడు నిమిషాల్లో చురుగ్గా ఆడిన తెలుగు యోదాస్ 21 పాయింట్లు సంపాదించి మొత్తం 14 పాయింట్ల పైచేయి సాధించింది. అయితే చివరి ఏడు నిమిషాల్లో ఓడిశా ఆటగాళ్ళు అద్భుతంగా రాణించి సత్తా చాటారు. ఆట ముగిసే సమయానికి 46-45 పాయింట్లు ఇరు జట్లూ సాధించాయి, దీనితో ఓడిశా కేవలం ఒక పాయింట్ తో తొలి టోర్నమెంట్ విజేతగా చరిత్ర సృష్టించింది.
Also Read : Ultimate Kho-Kho: ఫైనల్లో తెలుగు యోధాస్