Saturday, November 23, 2024
HomeTrending Newsమొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు - ఈటెల విమర్శ

మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు – ఈటెల విమర్శ

తెలంగాణ ప్రజానీకం రెండవ సారి అధికారం కట్టబెట్టిన తరువాత శాసనసభ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. శాసన సభ్యులను గడ్డి పోచల్లగా అవమానిస్తున్నారన్నారు. శాసనసభ ముందు గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద, అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన బిజెపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ లు ప్రభుత్వం తీరుపై విరుచుకు పడ్డారు. శాసనసభ సమావేశాలు 2- 3 రోజులకే పరిమితం చేస్తున్నారని, పోయినసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడం పై అడిగినందుకు మమ్మల్ని అకారణంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు.

విఆర్ ఏ ,గ్రామ కార్యదర్శులు ,గెస్ట్ లెక్చరర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తెలంగాణ గడ్డ మీద ఏ వర్గం సంతోషంగా లేదని ఈటెల అన్నారు. ముఖ్యమంత్రి మాకు 6,12,13 వ తేదీ మాత్రమే సమావేశాలు అని నోటీసులు పంపారని, చరిత్రలో ఎప్పుడు ఇంత తక్కువ సమావేశాలు జరగలేదన్నారు. బీఏసీని సంప్రదించకుండా 3 రోజులకె పరిమితం చేశారని, ఇది కేసీఆర్ అహంకారనికి నిదర్శనమన్నారు.

పోడు భూములు,దళిత బంధు ప్రజా సమస్యలపై ప్రభుత్వ మెడలు వంచుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 17ను మరిచిపోయారని, అమిత్ షా స్వయంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా జరిపి అండగా ఉంటామని చెప్పారని గుర్తు చేశారు. వేడుకలు నిర్వహించేందుకు తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఈటల రాజేందర్ మండిపడ్డారు.

Also Read : ఎనిమిదేళ్ళలో కెసిఆర్ సామాన్యులను కలిశారా ఈటెల రాజేందర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్