శర్వానంద్ హీరోగా శ్రీకార్తీక్ దర్శకత్వంలో ‘ఒకే ఒక జీవితం‘ సినిమా రూపొందింది. ఎస్.ఆర్.ప్రభు ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో నిర్మించారు. ఒక వైపున మదర్ సెంటిమెంట్ .. మరో వైపున ఆ తల్లి ప్రేమను పొందడానికి టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అమల కీలకమైన పాత్రను పోషించారు. ముఖ్యమైన పాత్రలో నాజర్ కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ స్వరపరిచిన పాటలు .. అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
ఈ నెల 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ వేదికపై శర్వానంద్ మాట్లాడుతూ .. “అమలగారు కాకుండా ఈ సినిమాలో అమ్మ పాత్రలో మరొకరిని ఊహించుకోలేం. ఆమెను చూస్తుంటే నాకు మా అమ్మనే గుర్తుకు వచ్చింది. అందువలన నాకు నటిస్తున్నట్టుగా అనిపించలేదు. ఇక రీతూ వర్మ విషయానికి వస్తే, కథ వినగానే ఆమె ఓకే చెప్పడం విశేషం. ఎన్ని సీన్లు ఉంటాయి? ఎన్ని సాంగ్స్ ఉంటాయి? అనేది అడగకుండా, ఒక మంచి సినిమాలో తాను భాగం కావాలని వచ్చారు. నిజంగా ఇది గొప్ప విషయమే.
ప్రియదర్శి రోల్ చాలా బాగుంటుంది .. తాను చాలా బాగా చేశాడు. ఇక వెన్నెల కిశోర్ ఈ ఈవెంట్ కి రాకుండా తప్పించుకున్నాడు. వాడికి ఈ సినిమా ఇప్పించింది నేనే. ‘కిశోర్ గుర్తుపెట్టుకో నిన్ను వదిలేదే లేదు .. నీ దగ్గరికే వస్తున్నాను’ అంటూ ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సినిమాలో కిశోర్ నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరంతా కూడా కొత్త కిశోర్ ను చూస్తారు. ప్రామిస్ చేసి చెబుతున్నాను .. ఈ సినిమా మిమ్మల్ని ఎంతమాత్రం నిరాశపరిచదు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో చూడండి” అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : ఆరేళ్లపాటు అప్పులు తీర్చడమే సరిపోయింది: శర్వానంద్