Saturday, November 23, 2024
HomeTrending Newsఅమరావతి పాదయాత్రకు హైకోర్టు అనుమతి

అమరావతి పాదయాత్రకు హైకోర్టు అనుమతి

అమరావతి పరిరక్షణ సమితి  ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి నవంబర్ 11 వరకూ చేపట్టిన మహా పాదయాత్రకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  పాదయాత్రకు అనుమతి కోరుతూ సమితి చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర డిజిపి నిరాకరించారు. దీనిపై అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖను చేసింది.  దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.  600 మంది పాదయాత్రలో పాల్గొనేందుకు పేర్లు ఇచ్చి ఐడి కార్డులు ఇవ్వాలని సమితికి సూచించింది.

పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించాలని స్పష్టం చేసింది.  పాదయాత్ర ముగింపు రోజు బహిరంగ సభ అనుమతి కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించిన కోర్టు, దీన్ని పరిశీలించాలని పోలీసులకు ఆదేశించింది.  రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్న ఉన్నం మురళీధర్, వివి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.

విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. రాజకీయ నాయకులు వేలాది మందితో పాదయాత్ర చేసుకోవచ్చు కానీ 600మంది రైతులు పాదయాత్ర చేయకూడదా అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. ఈ పాద్యయాత్రకు ఎందుకు భద్రత కల్పించాలేరని యంత్రాగాన్ని ప్రశ్నించింది.

జోడో యాత్ర వివిధ రాష్ట్రాల మీదుగా సాగుతుంటే దానికి పర్మిషన్ ఇచ్చారని, ఢిల్లీ లో వేలాది మంది రైతులు ర్యాలీలు చేస్తుంటే అనుమతించారని, అలాంటప్పుడు 35వేల మంది రైతుల్లో 600మంది పాద యాత్ర చేస్తామంటే దానికి అనుమతి ఇవ్వలేమని ఎలా చెబుతారని హైకోర్టు నిలదీసినట్లు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్