Saturday, November 23, 2024
HomeTrending Newsఅయోధ్య రామాలయానికి 1800 కోట్లు

అయోధ్య రామాలయానికి 1800 కోట్లు

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం రూ.1800 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు అధికారులు అంచ‌నా వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్య‌లో ఆల‌య నిర్మాణం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఆల‌య కాంప్లెక్స్‌లో ప్ర‌ఖ్యాత హిందూ మ‌త సాధువుల విగ్ర‌హాల‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని ఫైజాబాద్ స‌ర్క్యూట్ హౌజ్‌లో జ‌రిగిన మీటింగ్‌లో తీర్మానించారు. అయితే నిపుణులు ఇచ్చిన నివేదిక ప్ర‌కారం .. కేవ‌లం రామాల‌య నిర్మాణం కోసం 1800 కోట్లు అవుతుంద‌ని ట్ర‌స్టు తెలిపింది. ట్ర‌స్టుకు సంబంధించిన రూల్స్‌ను ఫ్రేమ్ చేసిన‌ట్లు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ చంప‌త్ రాయ్ తెలిపారు. రామాయ‌ణ కాలం నాటి ప్ర‌ధాన క్యారెక్ట‌ర్ల‌కు చెందిన విగ్ర‌హాల‌ను కూడా ఆల‌య కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయ‌నున్నారు. డిసెంబ‌ర్ 2023 నాటికి రామాల‌య నిర్మాణం పూర్తి అవుతుంద‌ని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్