Saturday, November 23, 2024
HomeTrending Newsసెప్టెంబర్‌ 17పై గవర్నర్ వైఖరి ఆక్షేపనీయం - గుత్తా

సెప్టెంబర్‌ 17పై గవర్నర్ వైఖరి ఆక్షేపనీయం – గుత్తా

కొంతమంది బాధ్యత లేకుండా సెప్టెంబర్‌ 17ను విలీనం, విమోచనం అంటూ.. ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే ఎంటో తెలియనివారు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా విమోచన దినo అని వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో కలిసి 74 ఏండ్లు పూర్తవుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
గవర్నర్‌ తన పూర్వ పార్టీ భావజాలాన్నే అనుసరిస్తున్నారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థకు ఉండే గౌరవాన్ని పోగొట్టొద్దని సూచించారు. ఇక సెప్టెంబర్‌ 17 సందర్భంగా పరేడ్‌గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం సభ నిర్వహించడం సరికాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్నది ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ.. ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also Read సెప్టెంబర్ 17 తర్వాత వీఆర్ఏలతో చర్చలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్