దసరా నవరాత్రులలో పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి, శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవస్థానాలకు చెందిన అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఆహ్వానించారు.
అసెంబ్లీ ప్రాంగణంలోని సిఎం కార్యాలయంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్టు, దుర్గగుడి ఈవో డి భ్రమరాంబ, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ లు సిఎం జగన్ ను కలుసుకొని దసరా శరన్నవరాత్రుల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునస్వామి ఆలయంలో నిర్వహించే దసరా ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైలం దేవస్ధానం ఈవో లవన్న, దేవస్ధానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తదితరులు సిఎంను ఆహ్వానించారు.
ఇరు దేవాలయాలకు చెందిన ఆర్చకులు సిఎంకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి(దేవాదాయ, ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ దేవాదాయశాఖ కమిషనర్ ఎం హరిజవహర్‌లాల్ కూడా పాల్గొన్నారు.