హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు.
నాని మాట్లాడుతూ..” అల్లూరి ట్రైలర్ చాలా బావుంది. అలాగే శ్రీవిష్ణుకి కూడా కొత్తగా వుంది. విష్ణు కమర్షియల్ యాక్షన్ సినిమా చేయడం ఇదే మొదటిసారని అనుకుంటున్నాను. చాలా ఎనర్జిటిక్ గా వుంది. ఈ మధ్య కాలంలో ఎనర్జిటిక్ ఫిలిమ్స్ ని ప్రేక్షకులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అల్లూరి పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విష్ణు రియల్ లైఫ్ లో చాలా పెద్ద ఎంటర్ టైనర్. పర్శనల్ గా కలుస్తున్నపుడు శ్రీవిష్ణు విశ్వరూపం చూశాను.బయట చాలా రిజర్వడ్ గా వుండి లోపల చాలా సరదాగా ఉంటారని మహేష్ బాబు గారి గురించి విన్నాను. మహేష్ బాబు గారి తర్వాత శ్రీవిష్ణు ఆ కోవకి వస్తారు. శ్రీవిష్ణు కూడా అంత పెద్ద స్టార్ అయిపోవాలి. ఇప్పటికే మంచి నటుడనే పేరు వచ్చింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటాను. బెక్కెం వేణుగోపాల్ గారితో నేను లోకల్ చేశాను. ఆయన ఒక సినిమాని నిర్మిస్తారని అనడం కంటే దత్తత తీసుకుంటారని అనడం సబబు. సినిమా చేస్తున్నంత కాలం ఆ యూనిటే ఆయన కుటుంబం. అంత చక్కగా అందరినీ చూసుకుంటారు. ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాని చూస్తారు. గత రెండు నెలల్లో అది మళ్ళీమళ్ళీ రుజువైయింది. అల్లూరి కూడా గొప్ప విజయం సాధిస్తుంది. చిత్ర యూనిట్ అంతటికి ఆల్ ది వెరీ బెస్ట్ “తెలిపారు.
Also Read : అల్లూరి విజయంపైనే శ్రీవిష్ణు ఆశలన్నీ!