Saturday, January 18, 2025
Homeసినిమాధనుష్ 'సార్' రిలీజ్ డేట్ ఫిక్స్

ధనుష్ ‘సార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ పలు చిత్రాల నిర్మాణంతో దూసుకు పోతున్నారు.  తమిళ స్టార్ ధనుష్ తో ‘సార్’ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి నిర్మిస్తున్నారు.  ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు.

వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం షూటింగ్  పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఈ రోజు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్  కూడా విడుదల చేశారు.

కథానాయకుడు ధనుష్ క్లాస్ రూం లో స్టూడెంట్స్ ముందు టేబుల్ మీద కూర్చొని బ్లాక్ బోర్డు మీద గణితం సబ్జెక్ట్ కు సంభందించిన అంశాలను చూపిస్తూ ఉండటం కనిపించే చిత్రం ఆకట్టుకుంటోంది. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా కథానాయకుడు సాగించే ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు ‘సార్’ జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్న ది అటు ఆసక్తి ని, ఇటు ఉద్విగ్నత కు గురి చేస్తుంది.

Also Read: ధనుష్ మూవీలో తెలుగు హీరో

RELATED ARTICLES

Most Popular

న్యూస్