Friday, September 20, 2024
HomeTrending Newsతెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లపై సుప్రీంలో విచారణ

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లపై సుప్రీంలో విచారణ

తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సీట్ల పెంపుపై రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. తెలంగాణ అసెంబ్లీ సంఖ్యను 119 నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 సీట్లను 225 వరకు పెంచాలని పర్యావరణ నిపుణుడు పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోర్టును కోరారు. పిటిషన్‌లో తెలంగాణ, ఏపీ, కేంద్రం, ఈసీని ప్రతివాదులుగా చేరారు. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్‌ జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌ నియోజకవర్గాల పిటిషన్‌కు జత చేయాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది.

Also Read: మూడు రాజధానులపై  సుప్రీంకోర్టుకు ఏపీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్