మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య‘, ‘భోళా శంకర్’ సినిమాలు చేయనున్నారు. మరో ఇద్దరు దర్శకులకు కూడా సినిమా చేస్తానని మాట ఇచ్చారు. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్. అయితే.. చిరు సినిమాల్లో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న మూవీ వాల్తేరు వీరయ్య.
బాబీ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇందులో చిరు సరసన శృతిహాసన్ నటిస్తుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటుంది. చిరంజీవి, రవితేజ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఊర మాస్ మూవీగా రూపొందుతోన్న వాల్తేరు వీరయ్యను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. మరి.. వీరయ్యగా చిరు ఎంత వరకు మెప్పిస్తారో వేచి చూద్దాం.
Also Read: చిరు, బాలయ్య పోటీ సంక్రాంతికి ఉందా?