Monday, April 21, 2025
HomeTrending Newsరహదారి ప్రాజెక్టులకు నితిన్ గడ్కరీ శంఖుస్థాపన

రహదారి ప్రాజెక్టులకు నితిన్ గడ్కరీ శంఖుస్థాపన

కేంద్ర రోడ్డు రవాణా రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరి గురువారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో షుమారు 3,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఎనిమిది జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనుల్లో భాగంగా 5 పై వంతెన పనులు, మూడు రహదారుల నిర్మాణం పనులు ఉన్నాయి.

వాటి వివరాలు

1) వాకలపూడి – ఉప్పాడ – అన్నవరం ఎన్ హెచ్ – 516 ఎఫ్   లేనింగ్‌కు శంకుస్థాపన, ప్రాజెక్ట్ పొడవు 40.621 కిమీ  ప్రాజెక్ట్ వ్యయం : రు.1345 కోట్లు.

2) సామర్లకోట – అచ్చంపేట జంక్షన్ ఎన్ హెచ్ – 516 ఎఫ్ నాలుగు రహదారులు, ప్రాజెక్ట్ పొడవు: 12.25 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 710 కోట్లు,

3) రంపచోడవరం నుండి కొయ్యూరు ఎన్ హెచ్ – 516 ఈ వరకు రెండు లైన్ల నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 70.12 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 570 కోట్ల,

4) కైకరం ఎన్ హెచ్ – 216 ఏ వద్ద నాలుగు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 1.795 కిమీ, ప్రాజెక్ట్ వ్యయం: రు.70 కోట్లు,

5) మోరంపూడి ఎన్ హెచ్ – 216 ఏ  వద్ద నాలుగు లైన్ల ఫ్లైఓవర్ పని ప్రారంభం, ప్రాజెక్ట్ పొడవు: 1.42 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 60 కోట్లు.

6) ఉండ్రాజవరం ఎన్ హెచ్ – 216 ఏ వద్ద నాలుగు లైన్ల  ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 1.25 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు.35 కోట్లు,

7) తేతాలి ఎన్ హెచ్ – 216ఏ  వద్ద నాలుగు లైన్ల  ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 1.03 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 35 కోట్లు,

8) జొన్నాడ ఎన్ హెచ్ – 216 ఏ వద్ద నాలుగులైన్ల  ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 0.93 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 25 కోట్లు.

కార్యక్రమంలో ఆర్ అండ్ బి మంత్రి దాడిశెట్టి రాజా,  ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ  ఎం.టి. కృష్ణ బాబు, నేషనల్ హైవే పీ డీ సురేంద్ర బాబు, జాతీయ రహదారుల అధికారులు, జిల్లా కలెక్టర్ డా. మాధవీలత, ఎంపీలు రాజమహేంద్రవరం , ఎంపీ మార్గాని భరత్  రామ్, కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింతాఅనురాధ, అరకు ఎంపీ జి. మాధవి, శాసన సభ్యులు  జక్కంపూడి రాజా, తలారి వెంకటరావు, రూరల్ ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ , స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్