బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ సైన్యం 1971 లో అనేక అరాచకాలకు పాల్పడిందని మహిళా సంఘాలు న్యూయార్క్ లో నిరసన ప్రదర్శన చేపట్టాయి. 9 నెలల్లో పాకిస్తాన్ సైన్యం సుమారు ముప్పై లక్షల మంది బంగ్లా పౌరులను పొట్టన పెట్టుకుందని ఐక్యరాజ్యసమితి ముందు నిరసన తెలిపారు. పాకిస్తాన్ జరిపిన నరమేధంలో ఆనాడు మహిళలు, చిన్నారులే ఎక్కువగా సమిధలయ్యారని… పాక్ లో మైనారిటీల మీద జరుగుతున్న అకృత్యాలపై ఐక్యరాజ్య సమితిలో చర్చ జరగాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో బంగ్లాదేశ్ లో అరాచాకాలు చేసిన పాక్ ప్రభుత్వం… ఈ రోజు స్వదేశంలో మైనారిటీల పట్ల అమానుష ఘటనలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. సింద్, బలోచిస్తాన్, ఖైభర్ పఖ్తుంక్వ, ఆక్రమిత కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని… సిక్కులు, హిందు మహిళల కిడ్నాప్, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. పాకిస్తాన్ ప్రభుత్వ కుట్ర పూరిత విధానాలపై యుఎన్ లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. యూఎన్‌లోని ఇండియన్ మిషన్ కార్యదర్శి మిజిటో వినిటో మాట్లాడుతూ.. కశ్మీర్‌పై పాక్ ప్రధాని షెహబాజ్ తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలిపారు. పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్నట్లు మిజిటో ఆరోపించారు. భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు పాక్ ప్రధాని.. యూఎన్‌ను వేదికగా చేసుకోవడం సరైన విధానం కాదన్నారు. స్వదేశంలో ఉన్న సమస్యల నుంచి తప్పుదోవ పట్టించేందుకు ఆయన ఇలా చేశారని వినిటో ఆరోపించారు. దావూద్ ఇబ్రహీం గురించి ప్రస్తావించిన భారత్.. శాంతి కావాలని ఆశిస్తున్న దేశం.. 1993 బాంబు పేలుళ్ల నిందితులకు ఆశ్రయాన్ని ఇవ్వదని అన్నారు. పాక్‌తో భారత్ స్నేహపూర్వక సంబంధాల్ని కోరుతున్నట్లు వినిటో తెలిపారు. ఉగ్రవాదం, ద్వేషం, హింస వద్దన్నారు. స్వదేశంలో మైనార్టీలను పట్టించుకోని పాకిస్థాన్.. ప్రపంచ స్థాయిలో మైనార్టీల రక్షణ గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు.
Also Read : పాకిస్తాన్లో ఆహార సంక్షోభం