టీమిండియాకు టి 20 వరల్డ్ కప్ కు ముందు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి. ఈ గాయం వల్లే నిన్న (బుధవారం) సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి 20లో బుమ్రా ఆడలేదు.
కాగా, ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తరువాత కొన్ని రోజులు బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ తో పాటు టి 20, వన్డే సిరీస్ లో కొన్ని మ్యాచ్ లు ఆడాడు. వెన్నునొప్పి కారణంగానే గత నెలాఖరున మొదలైన ఆసియా కప్ లో కూడా ఆడలేదు.
గతవారం ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన టి 20 సిరీస్ లో కూడా మొదటి మ్యాచ్ కు అందుబాటులో లేడు, మిగిలిన రెండు మ్యాచ్ లు ఆడినా అంతగా రాణించలేదు. ఈలోగా మళ్ళీ వెన్నునొప్పి కారణంగా సౌతాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ టి 20 టోర్నీ నుంచే వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read : T20 World Cup: Team India- జడేజా అవుట్