సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను ఇండియా కైవసం చేసుకుంది. సిరీస్ విజేతను నిర్ణయించే నేటి మ్యాచ్ లో భారత బౌలర్లు పదునైన బంతులతో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేసి 99 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇండియా ఈ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రోటీస్ జట్టులో క్లాసేన్-34; జన్నేమాన్ మలాన్-15; మార్కో జన్సేన్ -14 పరుగులతో మాత్రమే రెండంకెల స్కోరుతో రాణించారు. దీనితో ఆ జట్టు 27.1 ఓవర్లలో 99 పరుగులకే చాప చుట్టేసింది.
ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు; సిరాజ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ తలా రెండు వికెట్లతో రాణించారు.
ఆ తర్వాత ఇండియా తొలి వికెట్ కు 42 పరుగులు చేసింది. శిఖర్ కేవలం 8 పరుగులే చేసి రనౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ 49 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ 10 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్(28)- సంజూ శామ్సన్(2)లు నాటౌట్ గా నిలిచారు. శ్రేయాస్ సిక్సర్ తో విన్నింగ్ షాట్ కొట్టాడు. 19.1 ఓవర్లలో 105 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా బౌలర్లలో నిగిడి, బిజోర్న్ చెరో వికెట్ పడగొట్టారు.
కుల్దీప్ యాదవ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’…మహమ్మద్ సిరాజ్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించింది.
Also Read : శ్రేయాస్ సెంచరీ- ఇండియా విజయం