మహిళల ఆసియా కప్ లీగ్ దశ పోటీలు నేడు ముగిశాయి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఇప్పటికే సెమి ఫైనల్స్ కు చేరుకున్నాయి. సెమీస్ చేరాలన్న ఆతిధ్య బంగ్లా దేశ్ ఆశలకు వరుణుడు గండి కొట్టాడు.
బంగ్లాదేశ్- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య నేడు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీనితో రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఒకవేళ నేటి మ్యాచ్ జరిగి బంగ్లా గెలిచి ఉంటే మెరుగైన రన్ రేట్ ద్వారా ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు ఉండేవి. కానీ మ్యాచ్ రద్దు కావడంతో ఐదు పాయింట్లతో నిష్క్రమించాల్సి వచ్చింది. నాలుగో జట్టుగా థాయ్ లాండ్ సెమీస్ బెర్త్ సంపాదించింది.
నేడు జరిగిన రెండో మ్యాచ్ లో శ్రీలంకపై పాకిస్తాన్ ఐదు వికెట్లతో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది.
లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యే నాటికి పాయింట్ల పట్టికలో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్ ల్యాండ్ మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి.
అక్టోబర్ 13న ఇండియా- థాయ్ లాండ్; పాకిస్తాన్- శ్రీలంక మధ్య సెమీఫైనల్స్ పోరు జరగనుంది.
విజేతను నిర్ణయించే ఫైనల్స్ మ్యాచ్ శనివారం 15న జరుగుతుంది.