ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ రైతు, ఎక్కడా ఫిర్యాదు చేయకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇ–క్రాపింగ్ చేయడం వల్ల ధాన్యం కొనుగోళ్లలో పూర్తిస్థాయిలో పారదర్శకత వచ్చిందని, గన్నీబ్యాగులు, కూలీలు, రవాణా.. అవసరమైన మేరకు అన్నీ సమకూర్చుకోవాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో క్యాంప్ కార్యాలయంలోజగన్ సమీక్ష నిర్వహించారు,
ఈ సందర్భంగా సిఎం చేసిన సూచనలు:
ధాన్యం కొనుగోళ్లలో సహాయంకోసం తీసుకుంటున్న వారిని రైతు సహాయకులుగా వ్యవహరించాలి
ధాన్యం కొనుగోళ్లపై రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవగాహన కల్పించాలి
రాష్ట్రంలో విస్తారంగా వరి సాగు అవుతున్నందున బియ్యం ఎగుమతులపైనా దృష్టిపెట్టాలి
దేశీయంగా డిమాండ్ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతిచేసే అవకాశాలు పరిశీలించాలి
బ్రోకెన్ రైస్‌ను ఇథనాల్ తయారీకి వినియోగించడంపై దృష్టి పెట్టాలి
ఇప్పటికే ఇఫ్కో ద్వారా ఒకటి, మహీంద్రా ద్వారా మరో ప్లాంటు నుంచి ఇథనాల్ తయారీ కాబోతోంది
పొగాకు రైతులకు నష్టంరాకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలి
అక్టోబరు 17న ఈ ఏడాది రైతు భరోసా రెండో విడతకు అన్నిరకాలుగా సిద్ధం అవుతున్నామన్న అధికారులు.
ఖరీఫ్ ప్రారంభం కాకముందే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు పూర్తికావాలి
ప్రతి ఏటా కూడా ఇలాగే పరీక్షలు చేయాలి
దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత కార్డులో రికార్డు చేయాలి
భూసార పరీక్ష ఫలితాలను పరిగణలోకి తీసుకుని ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు వేయాలన్న దానిపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి
పంటల సాగుకు సంబంధించి సిఫార్సులు చేయాలి
ప్రతి ఆర్బీకేలో సాయిల్ టెస్టింగ్ డివైజ్ పెట్టాలి
దీనివల్ల విచక్షణ రహితంగా ఎరువులు, రసాయనాల వాడకం తగ్గుతుంది
తద్వారా రైతులకు పెట్టబడులుతగ్గి, ఖర్చులు తగ్గుతాయి
అంతేకాక మంచి వ్యవసాయ ఉత్పత్తులను సాధించడానికి అన్నిరకాలుగా ఈ విధానం ఉపయోగపడుతుండి
సాయిల్ టెస్టింగ్ ధానాన్ని పటిష్టంగా అమలు చేయడం కోసం దేశంలో ప్రసిద్ధ చెందిన బాంబే ఐఐటీ, కాన్పూర్ ఐఐటీలో కొన్ని సాంకేతిక విధానాలను పరిశీలించామని సిఎంకు తెలిపిన అధికారులు.
ఈ సమీక్షా సమావేశంలో పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్‌ఛైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి(మార్కెటింగ్, సహకారం) చిరంజీవిచౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, సివిల్ సఫ్లైస్ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ హరికిరణ్, సివిల్ సఫ్లైస్ వీసీ అండ్ ఎండీ జీ వీరపాండ్యన్, ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్ వీసీ అండ్ ఎండీ జి శేఖర్‌బాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : విద్య కోసమే నిబంధనలు: సిఎం జగన్