Sunday, January 19, 2025
HomeTrending Newsఎటూ తేలని హిజాబ్ వివాదం

ఎటూ తేలని హిజాబ్ వివాదం

కర్ణాటక హిజాబ్​ వివాదంపై ఎటూ తేల్చని సుప్రీంకోర్టు. పిటిషన్లను విచారించిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం. భిన్నమైన తీర్పు వెలువరించిన ఇద్దరు న్యాయమూర్తులు. హిజాబ్​పై కర్ణాటక ప్రభుత్వ నిషేధాన్ని కొనసాగించేలా ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన అపీళ్లన్నింటినీ కొట్టివేయాలని ప్రతిపాదించిన జస్టిస్ హేమంత్ గుప్తా.

కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కనబెడుతూ… హిజాబ్ బ్యాన్​పై అపీళ్లను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ సుధాన్షు ధూలియా. ఈ కేసులో 10 రోజుల పాటు వాదనలు. పిటిషనర్ల తరఫు 21 మంది న్యాయవాదులు, ప్రతివాదుల తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్, కర్ణాటక అడ్వకేట్ జనరల్. న్యాయమూర్తుల భిన్నాభిప్రాయాల నేపథ్యంలో సరైన ఆదేశాల కోసం ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని నిర్ణయం.

Also Read : హిజాబ్‌ పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

RELATED ARTICLES

Most Popular

న్యూస్