నాగార్జున ఇటీవల ‘ది ఘోస్ట్‘ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఇక ఈ మూవీ తర్వాత నాగార్జున దర్శకుడు మోహన్ రాజాతో ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని నాగార్జున 100వ చిత్రంగా ప్రకటించనున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇక నాగ చైతన్య ‘థాంక్యూ’ ఫ్లాప్ తర్వాత దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా ప్రారంభించాడు. ఇందులో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంటే.. చైతు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ ద్విభాష చిత్రంలో అరవింద్ స్వామి, ప్రియమణి, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది.
ఇక అఖిల్ విషయానికి వస్తే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే.. ఏజెంట్ తర్వాత అఖిల్ ఓ తమిళ దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ ను పట్టా లెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు పి.ఎస్.మిత్రన్. ఈయన తాజాగా కార్తీతో తీసిన ‘సర్దార్’ సినిమా దీపావళి కానుక విడుదల కాబోతోంది. ఇలా.. అక్కినేని హీరోలు ముగ్గురూ తమ తమ తదుపరి చిత్రాలను తమిళ దర్శకులతో చేస్తున్నారు. ఇలా ప్లాన్ చేశారా.. అనుకోకుండా జరుగుతుందో అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఈ తమిళ దర్శకులు అక్కినేని హీరోలకు సక్సెస్ ను అందిస్తారో..? లేదో..? చూడాలి.
Also Read : ‘శివ’లో చైన్ .. ‘ఘోస్ట్’లో కత్తి: నాగార్జున